కాలితో తన్నిన వ్యక్తి.. లారీ కింద పడి యువకుడి దుర్మరణం (VIDEO)

TG: సూర్యాపేట జిల్లా కోదాడలో మద్యం తాగేందుకు వెళ్లిన ముగ్గురు స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక యువకుడు లారీ కింద పడి మృతి చెందాడు. జూన్ 30న రమేష్, మహేష్ మధ్య జరిగిన గొడవను ఆపేందుకు ప్రయత్నించిన యాకూబ్‌ను మహేష్ దూషించి, రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న అతడిని కాలితో తన్నాడు. దీంతో యాకూబ్ నియంత్రణ కోల్పోయి లారీ కింద పడి తీవ్రగాయాలపాలై, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మొదట రోడ్డు ప్రమాదంగా భావించిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అసలు నిందితుడు మహేష్‌ను గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్