తిరుమల మెట్లు ఎక్కుతూ గుండెపోటుతో యువకుడు మృతి!

AP: తిరుమలలో విషాద ఘటన చోటుచేసుకుంది. తిరుపతి కొండ మెట్లు ఎక్కుతుండగా గుండెపోటు రావడంతో ఓ యువకుడు మృతి చెందాడు. కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన జాఫర్(25)అనే యువకుడు శనివారం బంధువులతో కలిసి తిరుపతికి వెళ్లాడు. అయితే తిరుపతి కొండ మెట్లు ఎక్కుతున్న సమయంలో గుండెపోటు రావడంతో కుప్పకూలాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించినట్లు బంధువులు తెలిపారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్