గణేష్ శోభాయాత్రలో అపశృతి.. డ్యాన్స్ చేస్తూ యువకుడి మృతి

TG: నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్‌) మండలంలో గణేష్‌ శోభాయాత్రలో విషాద ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి గణేష్‌ నిమజ్జన ఊరేగింపులో డ్యాన్స్‌ చేస్తున్న సింగారపు బాలయ్య అలియాస్‌ రాము (34) అలసిపోయి ఇంటి ముందు మెట్లపై కూర్చున్నాడు. ఇంతలో గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. కుటుంబసభ్యులు, స్థానికులు CPR చేసి వెంటనే హాలియాలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕