యూపీలోని దేవరియా జిల్లా, రుద్రపూర్ కతరీ మోడ్ వద్ద ప్రమాదం తృటిలో తప్పింది. హైటెన్షన్ విద్యుత్ తీగలపై అల్లుకున్న తీగలను శుభ్రం చేసేందుకు ఓ యువకుడు హైడ్రా మెషీన్ సాయంతో పైకి ఎక్కాడు. అయితే, అకస్మాత్తుగా మెషీన్ అదుపుతప్పి ఒరగడంతో ఆ యువకుడు ప్రాణభయంతో హైటెన్షన్ తీగలను పట్టుకుని గాల్లో వేలాడాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.