అసూయతో మిత్రుడి ప్రాణం తీసిన యువకుడు

పక్కవాడు బాగుపడితే చూడలేని రోజులు ఇవి. ఎదిగే వాడిని ఎలా తొక్కాలి అనుకుని మృగంలా మారిపోయి కొందరు ప్రవర్తించడం చూస్తూనే ఉంటాం. తాజాగా, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణ ఘటన జరిగింది. సంపన్న నేపథ్యం, మంచి ఇల్లు కట్టుకున్నాడనే అసూయతో ఓ యువకుడు తన 18 ఏళ్ల తోటి మిత్రుడి ప్రాణం తీశాడు. స్నేహితుడికి సాఫ్ట్‌ డ్రింక్‌లో పురుగుమందు కలిపి ఇచ్చి, అతడి మృతికి కారణమయ్యాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్