గుజరాత్ సాబర్కాంఠా జిల్లాలో 27 ఏళ్ల యువకుడికి కుక్క కరవడంతో రేబీస్ సోకి హైడ్రోఫోబియా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఆ యువకుడు కుక్కలాగా నడుస్తూ, కరవడానికి ప్రయత్నించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బాధితుడిని పాలన్పూర్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ముందు జాగ్రత్తగా అతని కాళ్లు, చేతులను తాళ్లతో కట్టేసి చికిత్స అందిస్తున్నారు. బాధితుడు బతికే అవకాశం తక్కువని సోషల్ మీడియాలో పలువురు కామెంట్ చేస్తున్నారు.