భూపాలపల్లి జిల్లాలో యువకుడు దారుణ హత్య

TG: భూపాలపల్లి జిల్లా రేగొండలో శుక్రవారం రాత్రి దారుణ ఘటన జరిగింది. ఓ యువకుడిని అతి కిరాతకంగా హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. రంగయ్యపల్లి గ్రామానికి చెందిన శ్రావణ్(35) మండల కేంద్రంలోని వైన్స్ షాప్ ఎదుట ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్నాడు. కాగా, శుక్రవారం రాత్రి షాప్ మూసి ఇంటికి వెళ్తుండగా హత్యకు గురయ్యాడు. పదునైన ఆయుధంతో నరికి చంపినట్లు తెలుస్తోంది. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమా.. లేక మరేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్