హర్యానాలోని ఫరీదాబాద్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. పోలీసులకు సమాచారం అందిస్తున్నాడనే అనుమానంతో ఒక యువకుడిని స్కార్పియో కారుతో తొక్కించి చంపేందుకు ప్రయత్నించారు. నిందితులు కావాలనే సదరు యువకుడిపైకి వాహనాన్ని దూకించడం అందులో కనిపిస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, వీడియో ఆధారంగా నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు.