సిగరెట్ విషయంలో గొడవ.. యువకుడిని కత్తితో పొడిచి చంపేశారు

సిగరెట్ విషయంలో జరిగిన చిన్నపాటి వివాదం ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకున్న ఘటన ఢిల్లీలోని జహంగీర్‌పురిలో చోటుచేసుకుంది. స్థానికంగా జ్యువెలరీ షాపులో పనిచేస్తున్న అర్బాజ్ (26)పై కొందరు యువకులు కత్తులతో దాడి చేయగా, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, సిగరెట్ విషయంలో ప్రారంభమైన గొడవ కారణంగా నిందితులు అర్బాజ్‌పై కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆరుగురు మైనర్లు, ఒక మేజర్ పాల్గొన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్