అమ్మాయి కోసం వెళ్లిన యువకుడు.. అనుమానాస్పద స్థితిలో మృతి (వీడియో)

AP: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం జి.కురప్పల్లెకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జయదీప్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందడం కలకలం రేపుతోంది. ఓ యువతి ఫోన్ చేయడంతో దండపల్లెకురప్పల్లె గ్రామానికి వెళ్లిన జయదీప్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడిని పథకం ప్రకారం పిలిపించి దాడి చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే యువతి కుటుంబ సభ్యులు మిద్దెపై నుంచి పడిపోవడంతో గాయాలయ్యాయని చెబుతున్నారు. ఘటనపై గంగవరం పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
VIDEO CREDIT: BIG TV

సంబంధిత పోస్ట్