శుభకార్యానికి వెళ్లి వస్తూ.. రోడ్డు ప్రమాదంలో యువతి మృతి

TG: నిజామాబాద్​ జిల్లా మోస్రా శివారులో రోడ్డుపై పోసిన ధాన్యం కుప్ప ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. NZB పట్టణంలోని నాందేవ్​వాడకు చెందిన దేవిరెడ్డి అనే యువతి సోదరితో కలిసి మోస్రాలో తన బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి వెళ్లింది. అక్కడి నుంచి స్కూటీపై తిరిగి ఇంటికి బయలుదేరింది. ఈ క్రమంలో రోడ్డుపై పోసిన వడ్ల కుప్ప పైకి స్కూటీ ఎక్కడంతో దేవి కింద పడిపోయింది. తీవ్ర గాయాలు కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దేవి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్