లేఖ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన యువతి!

హైదరాబాద్‌లోని మేడిపల్లి ప్రాంతంలో 19 ఏళ్ల యువతి డిప్రెషన్‌లో ఉన్నానని, శివుడి దగ్గరకు వెళ్తున్నానని లేఖ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. రెండ్రోజుల క్రితం కనిపించకుండా పోయిన యువతి కోసం వెతుకుతుండగా తల్లిదండ్రులకు ఈ లేఖ దొరికింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో ఓ యువకుడితో పరిచయం ఉండటంతో తల్లిదండ్రులు మందలించారని, అప్పటి నుంచి యువతి అతనితో మాట్లాడటం మానేసిందని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్