పార్టీ నుంచి సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్

పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ తన ఎమ్మెల్యే సుఖ్‌వీర్‌ సింగ్‌ మైసర్‌ఖానాను పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, తప్పుడు వదంతులు వ్యాప్తి చేయడం, పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీయడం వంటి ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. ఇటీవల మౌర్‌ ఎమ్మెల్యే మైసర్‌ఖానా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతపై ప్రశ్నించారు. సమస్యను సీఎం భగవంత్‌ మాన్‌, ఇతర పార్టీ నేతల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని ఓ లైవ్‌ వీడియోలో పేర్కొన్నారు. ప్రజలు, విద్యార్థుల సమస్యలపై ప్రశ్నించడం కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕