గుజరాత్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే చైతర్ వాసవను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నర్మదా జిల్లా దేడియాపడా గ్రామంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అదే సమయంలో చిన్న వివాదం చోటుచేసుకోగా, స్థానిక నేత సంజయ్ జోక్యం చేసుకున్నారు. ఆగ్రహించిన ఎమ్మెల్యే చైతర్ తన మొబైల్ ఫోన్‌ను విసరడంతో, అది సంజయ్ తలకి తాకి గాయమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి చైతర్ వాసవను అరెస్ట్ చేశారు.