ఆరోగ్యశ్రీ బంద్.. రోగులపై ప్రభావం

TG: పేదలకు ఖరీదైన శస్త్రచికిత్సలు, వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఆరోగ్యశ్రీ పథకంలో ప్రభుత్వం 1,835 వైద్య సేవలతో పాటు చికిత్స పరిమితిని రూ.10 లక్షల వరకు పెంచింది. ఇందులో సాధారణ వైద్యం, ఈఎన్‌టీ, కళ్లు, ఎముకలు, అవయవ మార్పిడి, కాలేయ మార్పిడి, క్రిటికల్‌ కేర్, గుండె సంబంధిత, తలసేమియా, హిమోఫీలియా వంటి అన్ని రకాల వైద్య చికిత్సలు ఉచితంగా అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ సేవల బంద్‌తో రోగులపై ప్రభావం పడుతోంది.

సంబంధిత పోస్ట్