మౌనీ అమావాస్యకు పురాణాల ప్రాకారం ఎంతో ప్రాధాన్యత ఉంది. నేడు దేవతలు భూమి మీదకు దిగి వచ్చి తిరిగాడుతారని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో మౌనీ అమావాస్యను పురస్కరించుకొని మధ్యప్రదేశ్‌లోని ప్రఖ్యాతి గాంచిన మహాకాలేశ్వర ఆలయంలోని శివునికి పండితులు హారతి కార్యక్రమం నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి ఆ త్రినేత్రుడుని దర్శించుకున్నారు.