ఇషాన్ రనౌట్ పై అభిషేక్ శర్మ ఆగ్రహం.. నెట్టింట వైరల్ వీడియో

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు టాప్ ఆర్డర్ విఫలమైంది. కేవలం 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత్ ఒత్తిడిలో పడింది. సాకిబ్ వేసిన రెండో ఓవర్లో సంజు శాంసన్ అవుట్ కాగా, ఆ తర్వాతి బంతికే ఇషాన్ కిషన్ రనౌట్ అయ్యాడు. సింగిల్ కోసం పిలిచిన ఇషాన్ ను అభిషేక్ శర్మ వెనక్కి వెళ్ళమని సైగ చేసినా, గమనించని కిషన్ పిచ్ మధ్యలోకి వచ్చేశాడు. దీంతో ఇషాన్ రనౌట్ అయ్యాడు. ఈ సంఘటనపై అభిషేక్ శర్మ 'అరే యార్ క్యా కర్ రహా హై' అని అరిచిన వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్