అభిషేక్, స్మృతికి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు

సెప్టెంబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ, మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధానలకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు లభించింది. ఆసియా కప్‌లో 7 మ్యాచ్‌ల్లో 314 పరుగులు చేసిన అభిషేక్ టీ20 ఫార్మాట్‌లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో 308 పరుగులు చేసిన స్మృతి 50 బంతుల్లో సెంచరీతో అదరగొట్టింది. ఒకే నెలలో భారత పురుష, మహిళా క్రికెటర్లకు ఈ అవార్డు రావడం విశేషం.

సంబంధిత పోస్ట్