గడువు ముగిసిన పాలతో అరుణాచలేశ్వరునికి అభిషేకం

తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో గురువారం ప్రదోషోత్సవం సందర్భంగా స్వామివారికి, మహానందికి నిర్వహించిన క్షీరాభిషేకంలో గడువు ముగిసిన పాలను ఉపయోగించినట్లు గుర్తించారు. దీంతో ఆహార భద్రత, హిందూ దేవాదాయశాఖ అధికారులు శుక్రవారం ఆలయం వద్ద తనిఖీలు చేపట్టారు. ఉత్తర రాజగోపురం వద్ద ఓ దుకాణంలో గడువు ముగిసిన పాల ప్యాకెట్లను భక్తులకు విక్రయిస్తున్నట్లు గుర్తించి, యజమానికి రూ.10 వేల జరిమానా విధించారు. ఇకపై అభిషేకానికి పాలను వినియోగించే ముందు గడువు తేదీని తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕