TG: మంచిర్యాల జిల్లాలో అబార్షన్ విఫలమై యువతి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. తాండూర్ మండల కేంద్రానికి చెందిన అక్కెపల్లి భాగ్యలక్ష్మి(24)ని గట్టు జగదీశ్ ప్రేమ పేరుతో మోసం చేసి గర్భవతిని చేశాడు. హైదరాబాద్‌లో అబార్షన్‌కు ప్రయత్నించి విఫలమవడంతో కర్నూలు తీసుకెళ్లి అబార్షన్‌కు యత్నించారు. ఈ క్రమంలో తీవ్ర రక్తస్రావంతో భాగ్యలక్ష్మి గురువారం మృతి చెందింది. జగదీశ్‌పై మృతురాలి అన్న కుమారస్వామి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్చార్జి ఎస్ఐ సౌజన్య తెలిపారు.