భార్య హత్య కేసులో 4 ఏళ్లుగా పరారీలో ఉన్న ఓ వ్యక్తి ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ చేసి దొరికిపోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఇండియన్ ఆర్మీలో కెప్టెన్‌గా పని చేసిన పంజాబ్‌కు చెందిన సందీప్ తోమర్ 2013లో తన భార్యను హత్య చేయగా కోర్టు అతడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2019లో బెయిల్ పై బయటకు వచ్చి.. కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్, హరియాణా హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు కూడా 2022లో అతడి యావజ్జీవ కారాగార శిక్షను సమర్ధిచింది. అప్పటినుంచి పరారీలో ఉండగా.. ఇటీవల గ్యాస్ సిలిండర్ బుక్ చేయడంతో దాని ఆధారంగా పోలీసులు పట్టుకున్నారు.