ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద ఏబీవీపీ ఆందోళన

TG: ఫీజు రీయంబర్స్‌మెంట్‌ పెండింగ్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి వద్ద ఏబీవీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఏపీవీపీ నేతలు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్