ACBకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన ఎస్సై

TG : నిజామాబాద్‌ జిల్లా బోధన్ పోలీస్ స్టేషన్‌లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటుండగా ఎస్ఐ భాస్కరాచారిని ACB అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 7వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఎస్ఐ భాస్కరాచారి ACB అదుపులో ఉన్నారు. ఈ ఘటనతో పోలీస్ శాఖలో కలకలం రేగింది.

సంబంధిత పోస్ట్