టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ తనిఖీలు

AP: టీటీడీ డిప్యూటీ ఈవో మెండు లోకనాథం నివాసంలో బుధవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో తిరుపతిలోని ఆయన నివాసంతో పాటు బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏడు బృందాలు ఉదయం 6 గంటల నుంచి సోదాలు కొనసాగిస్తున్నాయి. తిరుమలలోని లోకనాథం వసతిగృహం, తిరుపతిలోని బావమరుదుల ఇళ్లు, ఏర్పేడు మండలం చెల్లూరులోని సోదరుడి ఇంటితో పాటు ఎస్టీవీ నగర్‌ ఎస్‌బీఐ లాకర్లను కూడా పరిశీలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్