నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు

TG: హైదరాబాద్ నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఎర్రగడ్డ కల్పతరు అపార్ట్‌మెంట్స్‌లోని లక్ష్మీ భాస్కర్ నివాసంలో తనిఖీలు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు హైదరాబాద్ సహా మూడు జిల్లాల్లో 12 చోట్ల ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. లక్ష్మీ భాస్కర్‌కు సంబంధించిన నివాసాలు, ఇతర ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఆస్తులు, డాక్యుమెంట్లు, నగదు తదితరాలపై ఏసీబీ అధికారుల ఆరా తీస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕