డీఎస్పీ భీమ్‌ రెడ్డిపై ఏసీబీ దాడులు.. రూ.200 కోట్ల అక్రమాస్తుల కలకలం

తెలంగాణ పోలీస్ శాఖలో అవినీతిపై ఏసీబీ దృష్టి సారించింది. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై డీజీపీ ఆఫీస్ స్టేషనరీ వింగ్‌లో పనిచేస్తున్న డీఎస్పీ భీమ్‌ రెడ్డి నివాసాలపై గురువారం ఏసీబీ అధికారులు భారీ సోదాలు నిర్వహించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం, భీమ్‌ రెడ్డి అక్రమాస్తుల విలువ రూ. 200 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. హైదరాబాద్, జహీరాబాద్, రంగారెడ్డి, శంషాబాద్, గచ్చిబౌలి, వికారాబాద్ సహా 16 ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. ఒక బినామీ ఇంటి నుంచి రూ. 40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్