తమిళనాడులోని తూత్తుకుడిలో టీవీకే అధినేత విజయ్ చేపట్టిన ర్యాలీలో ప్రమాదం జరిగింది. విజయ్ కాన్వాయ్‌ను వెంబడిస్తున్న క్రమంలో ఒక అభిమాని బైక్ అదుపుతప్పి కింద పడిపోవడంతో, వెనుక వస్తున్న మరికొన్ని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు అభిమానులు గాయపడ్డారు. గతంలో కరూర్ సభలో తొక్కిసలాట జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.