హర్యానా యమునానగర్‌లోని హత్నికుండ్ బ్యారేజ్ వద్ద ఆర్మీ శిక్షణలో ప్రమాదం జరిగింది. బలమైన నీటి ప్రవాహంలో మోటార్ బోట్ కొట్టుకుపోవడంతో నలుగురు జవాన్లు నీటిలో పడిపోయారు. ఇద్దరు సురక్షితంగా బయటపడగా.. మరో ఇద్దరు కమాండోలు గల్లంతయ్యారు. గల్లంతైన జవాన్ల కోసం ఆర్మీ, SDRF బృందాలు, IAF హెలికాప్టర్లు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి.