KTR కన్నెపల్లి పర్యటనలో ప్రమాదం.. ఎమ్మెల్సీకి గాయం

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పర్యటనలో ప్రమాదం చోటుచేసుకుంది. కేటీఆర్‌ కాన్వాయ్‌లో వెళ్తుండగా భువనగిరి వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ఒక కారులో ఉన్న ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆయన ఛాతి భాగానికి బలమైన గాయం కావడంతో తీవ్ర నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయనను కొంపల్లిలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్