తమిళనాడు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. స్టంట్‌మ్యాన్ రాజు ఆదివారం ఉదయం మృతి చెందారు. నటుడు విశాల్ ఈ విషయాన్ని తన X ద్వారా వెల్లడించారు. హీరో ఆర్య, డైరెక్టర్ పా. రంజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా సెట్స్‌లో ఈ ప్రమాదం జరిగిందని విశాల్ తెలిపారు. కారుతో స్టంట్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ రాజు మరణించినట్టు పేర్కొన్నారు. రాజు మృతి పట్ల విశాల్ సంతాపం తెలిపారు.