కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ వద్ద పెద్దవాగుపై నిర్మిస్తున్న కొత్త రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ప్రమాదం చోటుచేసుకుంది. మూడో రైల్వే లైన్ కోసం నిర్మిస్తున్న వంతెన కూలిపోవడంతో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి, ఒకరు శిథిలాల కింద చిక్కుకున్నారు. స్థానికులు, తోటి కార్మికుల సహాయంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. రైల్వే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే ప్రమాదానికి కారణమని తోటి కార్మికులు, స్థానికులు ఆరోపిస్తున్నారు.