నటుడు విశాల్ 'పురుషన్' సినిమా షూటింగ్లో గాయపడినట్లు కోలివుడ్ వర్గాలు తెలిపాయి. గోవాలో జరుగుతున్న ఈ సినిమా చిత్రీకరణలో గురువారం ఓ ఫైట్ సీక్వెన్స్ తీస్తుండగా ఆయనకు గాయాలయ్యాయని, దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారని సమాచారం. ప్రస్తుతం షూటింగ్ నిలిపివేశారు, విశాల్ విశ్రాంతి తీసుకుంటున్నారు. గాయం తీవ్రతపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.