TG: సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌లో భారీ వినాయక విగ్రహం ధ్వంసమైంది. హైదరాబాద్ దూల్‌పేట నుంచి సిద్దిపేటకు తరలిస్తుండగా, ఫ్లైఓవర్‌పై సూచన బోర్డుకు విగ్రహం తగిలే అవకాశం ఉండటంతో లారీని ఆపారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో లారీ ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లారీపై ఉన్న భారీ వినాయక విగ్రహం కిందపడిపోయి పూర్తిగా ధ్వంసమైంది.