స్కూటీపై వెళ్తున్న ఓ మహిళ అకస్మాత్తుగా కుడివైపు మలుపు తీసుకోవడంతో ఎదురుగా వచ్చిన బైకర్ ప్రమాదానికి గురైనట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమెను తప్పించే ప్రయత్నంలో బైకర్ స్కిడ్ అయి కిందపడగా, మహిళ ఆగకుండా వెళ్లిపోయినట్లు వీడియోలో కనిపిస్తోంది. దీంతో నెటిజన్లు ఆమె నిర్లక్ష్యంపై విమర్శలు చేస్తున్నారు. 'మహిళలు స్కూటీ నడపడం కంటే ప్రమాదకరమైంది ఏదీ లేదు' అంటూ కామెంట్లు చేస్తున్నారు.