ఆచార్య చాణక్యుడు చెప్పిన సిద్ధాంతాలు నేటి సమాజంలో వ్యక్తిగత, వృత్తిపరమైన విజయానికి ఎంతో ఉపయోకరంగా మారుతున్నాయి. ఇంట్లో ఆనందాన్ని పెంపొందించడానికి ఆయన ముఖ్యమైన అలవాట్లను సూచించారు. మధురంగా మాట్లాడటం, పెద్దలను గౌరవించడం, పరిశుభ్రత పాటించడం, కోపాన్ని నియంత్రించడం, సంతృప్తిగా జీవించాలని సూచించారు. ఈ అలవాట్లు కుటుంబంలో ప్రేమ, సాన్నిహిత్యం, ప్రశాంతతను పెంచుతాయి.