షీట్ మాస్కులు దక్షిణ కొరియాలో ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ ప్రస్తుతం ఇవి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయి. షీట్ మాస్క్‌లు చర్మానికి త్వరగా, సులభంగా తేమను, పోషణను, కాంతిని అందిస్తాయి. విటమిన్లు, చర్మానికి మేలు చేసే పదార్థాల్లో ముంచి ఆరబెట్టిన ఈ తరహా మాస్కులను వాడటం వల్ల చర్మానికి తక్షణ మెరుపును అందించవచ్చని నిపుణులు అంటున్నారు. చర్మానికి అవసరమైన విటమిన్లు చర్మం లోపలి పొరల్లోకి వెళ్లేలా ఈ షీట్ మాస్కులు సాయపడతాయి.