TG: మంత్రి కొండా సురేఖ సీఎంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై చర్యలు తీసుకునేముందు సీఎంపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. పదేళ్ల పాటు తానే సీఎం అని చెప్పుకుంటున్నారని, మంత్రులు, నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నారని సురేఖ అన్నారు. తనను రాజీనామా చేయమని ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదని, బీసీలకు ఒక న్యాయం, ఇతర సామాజికవర్గాలకు మరో న్యాయం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.