ప్రముఖ నటుడు మాధవన్ త్వరలో 'ది గేమ్ ఛేంజర్స్: మిడిల్ ఈస్ట్' అనే బిజినెస్ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఆప్టిమిస్టిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ షోలో వివిధ దేశాల స్టార్టప్ ఫౌండర్లు అంతర్జాతీయ ఇన్వెస్టర్ల ముందు తమ వ్యాపార ఆలోచనలను వివరిస్తారు. పశ్చిమాసియా మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని దుబాయ్‌లో ఈ షో నిర్వహించబడుతుంది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది.