రెండు రాష్ట్రాల్లో పెసా చట్టం అమలుపై నటుడు రాహుల్ రామకృష్ణ దరఖాస్తు

తెలుగు రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాల్లో 'పెసా' చట్టం అమలు తీరుపై ప్రముఖ నటుడు రాహుల్ రామకృష్ణ ప్రభుత్వాలను ప్రశ్నించారు. సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు దరఖాస్తులు సమర్పించి, గిరిజన హక్కుల రక్షణకు తీసుకున్న చర్యలపై నివేదికలు కోరారు. గ్రామసభల నిర్వహణ, నిధుల వినియోగం, చట్టం అమలులో లోపాలపై ఆయన దృష్టి సారించారు. తాను దాఖలు చేసిన ఆర్టీఐ కాపీలను, ప్రశ్నలను ఆయన 'ఎక్స్' ఖాతాలో పంచుకోవడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్