నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ట్విట్టర్ (ఎక్స్) నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన భార్య, పిల్లలపై కొందరు అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో పాటు, వారిని చంపేస్తామని బెదిరించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. "కొన్ని నోటిఫికేషన్లు చూశాక తీవ్ర కోపం వచ్చింది, ఇక ఈ యాప్ తో నా పని అయిపోయింది" అని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన యాప్ను తొలగిస్తున్నట్లు తెలిపారు.