తెలుగు సినీ ప్రపంచంలో సున్నితమైన వ్యక్తిత్వం గల నటుడు రంగనాథ్ (తిరుమల సుందర శ్రీరంగనాథ్) దాదాపు 300 సినిమాల్లో హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు. 2015లో గాంధీనగర్‌లోని ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన భార్య చైతన్య 2009లో మృతి తరువాత, చివరి రోజుల్లో ఒంటరితనం, ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారట. అయితే ఆయనకు ఎంతో నమ్మకమైన పనిమనిషి మీనాక్షికి ఆస్తులు, బ్యాంక్‌లోని డబ్బును ఇచ్చారని ఆయన కొడుకు నాగేంద్ర కుమార్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.