‘జైలర్’ మూవీలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ‘రెడిన్ కింగ్స్లీ’. ఈయన 45 ఏళ్ల వయసులో 2023లో తన ప్రేయసి, సీరియల్ నటి సంగీతను పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పుడు తన భార్య ప్రెగ్నెంట్ అని రెడిన్ కింగ్స్లీ తెలిపారు. ఇటీవల సీమంతం నిర్వహించగా అందుకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. 47 ఏళ్ల వయసులో తండ్రి కాబోతుండటంతో కొందరు వావ్ గ్రేట్ అని అంటున్నారు.