ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిన నటి ఆమని, మెగాస్టార్ చిరంజీవిపై తన అభిమానాన్ని, ఆయనతో నటించాలనే తన కలను పంచుకుంది. 'రిక్షావోడు' సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చినా, చివరి నిమిషంలో నగ్మాకు వెళ్లిపోయిందని, అప్పుడు చాలా బాధపడ్డానని తెలిపారు. ఆ తర్వాత 'స్టాలిన్' సినిమాలో చిరంజీవికి అక్క పాత్ర కోసం సంప్రదించగా, తన డ్రీమ్ హీరోకు సోదరిగా నటించలేనని ఆమని ఆ అవకాశాన్ని తిరస్కరించింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.