తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరస్వామి ఆలయం వెనుక ఉన్న అన్నామలై గిరిని అటవీశాఖ నిషేధం ఉన్నప్పటికీ, బుల్లితెర నటి అర్చనా రవిచంద్రన్, నటుడు అరుణ్ ప్రసాద్ అనుమతి లేకుండా ఎక్కి ఫోటోలు దిగి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన అటవీశాఖ అధికారులు, ఇద్దరికీ రూ.5 వేల చొప్పున జరిమానా విధించి హెచ్చరించి పంపారు. పౌర్ణమి రోజుల్లో లక్షలాది మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణ చేస్తారు.