నటి దేవీప్రియ కారుకు ప్రమాదం.. డ్రైవర్ మృతి

ప్రముఖ బుల్లితెర నటి దేవిప్రియ తన సహాయకుడితో కలిసి సోమవారం తెల్లవారుజామున కారులో చెన్నై నుంచి తిరుచ్చి వైపు బయల్దేరారు. పెరంబలూర్ వద్ద కారు టైరు పంక్చర్ కావడంతో డ్రైవర్ ముత్తుగణేశ్(38) వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి టైరు మారుస్తుండగా వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం దేవిప్రియ కారును ఢీకొంది. ఘటనలో కారు డ్రైవర్ ముత్తుగణేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కారు పక్కన నిలబడి ఉన్న దేవిప్రియ తృటిలో తప్పించుకున్నారు. ఆమె సహాయకుడు దివాకర్ తీవ్రంగా గాయపడ్డారు.

సంబంధిత పోస్ట్