నడి రోడ్డుపై రెచ్చిపోయిన నటి

ముంబైలో బాలీవుడ్ నటి ఖుషీ ముఖర్జీ నడి రోడ్డుపై రచ్చ చేశారు. ఖుషీ తన బెంజ్ కారులో అంథేరీలోని రోడ్డుపై వెళుతుండగా.. లోఖండేవాలా ఏరియాలోకి రాగానే ఆమె కారును ఆటో ఢీకొట్టి వెళ్లి పోయింది. దీంతో కారు స్వల్పంగా డ్యామేజ్ అయింది. దీంతో కోపంతో రగిలిపోయిన ఖుషీ.. పక్కనే ఉన్న టపాసుల షాపు యజమానిపై ఫైర్ అయింది. అతడ్ని బాగా తిట్టింది. ఆ షాపులోని టపాసుల్ని తీసి రోడ్డుపై పడేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్