మలయాళ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. నటి మీనా గణేష్ (81) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో గత ఐదు రోజులుగా ఒట్టపాలెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మీనా గణేష్ పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈమె దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించారు.