దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ పట్టుబడిన కన్నడ నటి రన్యా రావుకు బెంగళూరు కోర్టు షాకిచ్చింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో ఆమెను కస్టడీలోకి తీసుకున్న డీఆర్‌ఐ అధికారులు పలు కోణాల్లో ప్రశ్నించగా.. ఆమె కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఈ వ్యవహారంలో పలువురు రాజకీయ నేతలు, అధికారుల పాత్ర ఉండొచ్చని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.