స్టార్ హీరోయిన్ సమంత మరోసారి డిజిటల్ వేదికపైకి వస్తున్నారు. ప్రముఖ ఓటీటీ వేదిక ‘సోనీలివ్ తమిళం’తో చేతులు కలిపినట్లు శనివారం అధికారికంగా ప్రకటించారు. సమంతతో కలిసి పనిచేయడం మొదలైందని, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే చెబుతామని ‘సోనీలివ్’ వెల్లడించింది. సమంత స్పందిస్తూ, "సోనీలివ్ తమిళంతో ఈ కొత్త అధ్యాయం మొదలుపెట్టడం సంతోషంగా ఉంది. అద్భుతమైన ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నాం. వివరాలు త్వరలోనే మీతో పంచుకుంటా" అని తెలిపారు.