సినిమాలకు రిటైర్‌మెంట్ ప్రకటించిన నటి తులసి

ప్రముఖ నటి తులసి యాక్టింగ్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీతో తాను నటన నుంచి వైదొలగుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. డిసెంబర్ 31న సాయిబాబా దర్శనానికి వెళుతున్నానని, అదే రోజు సినిమాలకు దూరమై మిగిలిన జీవితాన్ని సాయిబాబాకు అంకితం చేస్తానని ఆమె పేర్కొన్నారు. తులసి తెలుగుతో పాటు ఇతర భాషల్లో సుమారు 300 సినిమాలు చేశారు. తెలుగులో యువ హీరో, హీరోయిన్లకు తల్లి పాత్రల్లో నటించి మెప్పించారు.

సంబంధిత పోస్ట్